News February 12, 2025

17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు

image

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 27, 2025

HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

image

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్‌ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

News October 26, 2025

రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ యూనిట్‌లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్‌లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్‌ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.