News February 12, 2025

17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు

image

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 14, 2025

HYD: అరుదైన దృశ్యం.. ఇంటిపై ఇలవేల్పు!

image

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కులవృత్తి గౌరవాన్ని చాటిచెప్పే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎలిజాల మహేశ్ గౌడ్ తన ఇంటి ఎలివేషన్‌పై తాటి చెట్టెక్కుతున్నట్లు.. కల్లు పోస్తున్నట్లు సంప్రదాయ దృశ్యాలతో కళాత్మకంగా అలంకరించారు. వృత్తి సంస్కృతిని తరతరాలకు గుర్తు చేసేలా రూపొందిన ఈ అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. కులవృత్తి పట్ల గుర్తింపును చాటే ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.

News December 14, 2025

SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

image

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.

News December 14, 2025

డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

image

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.