News October 13, 2025

17వ తేదీ వరకు CPR వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌) వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సోమవారం తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చీరాల ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి సీపీఆర్‌ డెమోను అధికారులకు ప్రదర్శించి చూపించారు.

Similar News

News October 13, 2025

మంచిర్యాల: భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

image

ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు, మోఖా, సర్వే నంబర్లు, ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలతో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

News October 13, 2025

మంచిర్యాల: సీపీఆర్ గుండె ఆగిపోయిన వ్యక్తికి ప్రాణ రక్షణ చర్య

image

సీపీఆర్ అనేది అత్యవసర సమయంలో గుండె ఆగిపోయిన వ్యక్తికి వెంటనే చేయవలసిన ప్రాణ రక్షణ చర్య అని జిల్లా వైద్యాధికారులు చెప్పారు. జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజలకు సీపీఆర్ వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. రక్త ప్రసరణను కొనసాగించడంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలుపుకోకుండా ఉండటంలో సీపీఆర్ సహాయపడుతుందన్నారు.

News October 13, 2025

‘భారత కెప్టెన్‌ను మార్చాలి’.. ఫ్యాన్స్ డిమాండ్

image

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్‌కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్‌లూ కీలకం కానున్నాయి.