News September 13, 2024
17 నుంచి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. స్వచ్ఛతా కి భాగీదారి ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 17న మానవహారం, 20న మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు.
Similar News
News November 18, 2025
ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్ నాగరాణి

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు అభ్యర్థులు https:/apstudycircle.apcfss.in వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.