News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738988566435_710-normal-WIFI.webp)
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News February 8, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014862893_51869405-normal-WIFI.webp)
ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News February 8, 2025
పెద్దపల్లి: యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739014585722_14924127-normal-WIFI.webp)
పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. యాసంగిలో రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు. జిల్లాలో యూరియా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. యూరియా కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చన్నారు.
News February 8, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020785886_18976434-normal-WIFI.webp)
కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.