News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
Similar News
News March 28, 2025
HYD: అమ్మాయిలూ.. ఆటో ఎక్కుతున్నారా?

HYDలో అనేక మంది ఆటోలను బుక్ చేసుకోవడం, ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం చేస్తుంటారు. వారి భద్రత కోసం పోలీసులు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరుతో ఆటో డ్రైవరు వివరాలతో పాటు QR కోడ్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఆటోలో ఏదైనా మర్చిపోయినా, ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆటోలోని క్యూఆర్ కోడ్ పోలీసులకు పంపిస్తే చాలు, వెంటనే చర్యలు చేపట్టి సహాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
News March 28, 2025
పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.
News March 28, 2025
HYDలో భూగర్భ జలం సరిపోకే ఈ దుస్థితి..!

HYDలో తగినంత భూగర్భ జలాలు లేకపోవడంతోనే, 150 కిలోమీటర్ల దూరం నుంచి తాగునీరు సరఫరా చేయాల్సి వస్తోందని HMWSSB ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నగరంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే ఈ సమస్య ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. నీటి మేనేజ్‌మెంట్ మెరుగుపరిచి, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.