News January 4, 2026

$17 ట్రిలియన్ల సంపదే లక్ష్యం.. మదురో అరెస్ట్ వెనుక అసలు కథ ఇదేనా?

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించడంలో ఆ దేశంలోని 303 బిలియన్ బారెల్స్ ఆయిల్ నిక్షేపాలను కైవసం చేసుకోవడమే అమెరికా అసలు ప్లాన్ అనే చర్చ జరుగుతోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ $17.3 ట్రిలియన్లని అంచనా. ఇందులో సగం రేటుకు అమ్మినా $8.7 ట్రిలియన్లు వస్తాయి. ఇది జపాన్ GDP కంటే 4 రెట్లు ఎక్కువ. 12 గంటల్లో చైనా, అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే ఎక్కువ సంపదను US తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.

Similar News

News January 5, 2026

పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News January 5, 2026

బెయిలా? జైలా? ఉమర్ ఖలీద్‌పై నేడే సుప్రీం తీర్పు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. డిసెంబర్‌లో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తుండగా.. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అన్యాయమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.

News January 5, 2026

మదురో కోట మట్టిపాలైంది.. శాటిలైట్ పిక్స్‌ వైరల్!

image

వెనిజులా అధ్యక్షుడు మదురో చిక్కిన ‘ఫ్యూర్టే తియునా’ సైనిక స్థావరం US దాడుల్లో ధ్వంసమైనట్లు శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేస్తున్నాయి. డెల్టా ఫోర్స్ జరిపిన దాడిలో మదురో నివాసంతో పాటు, అక్కడి గోదాములు, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కేవలం 30 నిమిషాల్లోనే అమెరికా బలగాలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. బాంబు దాడుల ధాటికి భారీ భవనాలు కుప్పకూలి, వాహనాలు కాలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.