News July 11, 2024
17.9 అడుగులకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం
ఖానాపూర్ మండలంలో గల పాకాల సరస్సు నీటి మట్టం ఇటీవల కురిసిన వర్షాల ధాటికి 17.9 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30 అడుగులుగా ఉంది. పాకాల సరస్సులోని నీరు వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమై వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పాకాల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News November 29, 2024
చేర్యాల: BIRTHDAY రోజే బాలిక మృతి
కరెంట్ షాక్‌తో కావ్య(16) అనే <<14732971>>బాలిక మృతి<<>> చెందిన ఘటన చేర్యాలలో జరిగిన విషయం తెలిసిందే. నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నర్సింలు-లావణ్య దంపతుల పెద్ద కూతురు కావ్య ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. నీళ్లు ట్యాంకులోకి పట్టేందుకు మోటార్ వైరును స్విచ్ బోర్డులో పెడుతుండగా కరెంటు షాక్‌కు గురైంది.హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే చనిపోయింది. బాలికకు పుట్టినరోజే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు విలపించారు.
News November 29, 2024
WGL: జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, ఛైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజి ఎన్ఆర్ఐ మిలినియం ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీపీఆర్‌వో ఆయుబ్ అలీతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
News November 29, 2024
మండలంగా మల్లంపల్లి.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీతక్క
ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం హర్షనీయమని, కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని నిరూపించడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.