News August 5, 2025

మోదీ ప్రభుత్వంలో 17 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్

image

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో వెల్లడించారు. UPA పాలనలో కల్పించిన 3Cr ఉద్యోగాల కంటే ఇది చాలా అధికమని పేర్కొన్నారు. గత 16 నెలల్లో 11L మందికి ఉద్యోగాలు కల్పించామని, వచ్చే ఐదేళ్లలో ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. PM రోజ్‌గార్ యోజన కింద వచ్చే రెండేళ్లలో 3.5Cr+ జాబ్స్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Similar News

News August 5, 2025

తగ్గేదేలే అన్న భారత్

image

టారిఫ్స్‌పై అమెరికాకు <<17305975>>భారత<<>> విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్న అగ్రరాజ్యం.. యురేనియం, పల్లాడియం, కెమికల్స్ ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. తాము ఆయిల్ కొనడం వల్లే గ్లోబల్ ఎకానమీ స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. జాతీయ అవసరాల కంటే ఏదీ తమకు ఎక్కువ కాదని భారత్ అమెరికాకు తేల్చి చెప్పింది.

News August 5, 2025

వారికి ఇంటి వద్దకే రేషన్: మంత్రి మనోహర్

image

AP: కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.

News August 5, 2025

42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు

image

TG: BCలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది. ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ MPలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న CM, మంత్రులు, MPలు, MLAలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.