News January 12, 2025
దేశంలో 17 HMPV కేసులు

భారత్లో ఇప్పటివరకూ నమోదైన <<15087157>>HMPV <<>> కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్లో 5, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తమిళనాడు 2, కోల్కతా 3, అస్సాం 1, పుదుచ్చేరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రేపటి నుంచి యూపీలో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు పెరుగుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి దీనిని గుర్తించినట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 22, 2025
నల్గొండ జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు

ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం చాలా ఖరీదైపోతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడి గుడ్డు ధర రూ.8కి చేరడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. గుడ్ల ధరలు కొండెక్కినా కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220లకు తగ్గడం విశేషం.
News November 22, 2025
GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.


