News March 19, 2025
17 మంది మృతి.. J&K ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్లో 3 కుటుంబాల్లోని 17 మంది అనుమానాస్పదంగా <<15242949>>మృతి చెందడంపై<<>> అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి శరీరాల్లో 6 రకాల విషపదార్థాలు(అల్యూమినియం, కాడ్మియం, ఆల్డికార్బ్ సల్ఫేట్, ఎసిటామిప్రిడ్, డైథైల్డిథియోకార్బమేట్, క్లోర్ఫెనాపైర్) ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. బాక్టీరియల్, వైరల్ సంబంధిత వ్యాధులుగా నిర్ధారణ కాలేదంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
Similar News
News December 31, 2025
ఇతిహాసాలు క్విజ్ – 113 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన, బాణం వేసిన బోయవాడు ఎవరు? ఆయన పూర్వజన్మలో ఎవరు?
సమాధానం: త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపాడు కదా! ఆ వాలియే ద్వాపర యుగంలో ‘జరుడు’ అనే బోయవాడిగా జన్మించాడు. రాముడు వాలికి ఇచ్చిన మాట ప్రకారం.. ఈ జన్మలో కృష్ణుడిగా ఉన్న తనను చంపే అవకాశాన్ని వాలికి(జరుడికి) కల్పించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 31, 2025
పార్టీలో ఏది పడితే అది తినకండి!

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ హడావుడి మొదలైంది. ఏం తాగాలి.. ఏం తినాలో లిస్ట్ రాసేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘చిప్స్, పకోడీ, డీప్ ఫ్రై చేసిన చికెన్ వంటి వాటితో గ్యాస్, అసిడిటీ వస్తుంది. అందుకే నాన్వెజ్ కూడా మితంగా తినాలి. మటన్, చికెన్ వంటివి నైట్ డైజెస్ట్ అవ్వవు. స్వీట్స్, కేకులు కూడా లిమిట్గానే తినాలి’ అని సూచిస్తున్నారు.
News December 31, 2025
న్యూఇయర్ వేళ మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో న్యూఇయర్ వేళ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18719998>>మళ్లీ<<>> తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.980 తగ్గి రూ.1,35,220కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.900 పతనమై రూ.1,23,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


