News October 11, 2025
UGCలో 17 పోస్టులు.. అప్లై చేసుకోండి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC)లో 17 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఫస్ట్ క్లాస్‌లో PG, PhD, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 45ఏళ్లు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టులకు నెలకు రూ.60వేల నుంచి రూ.70వేలు చెల్లిస్తారు. రూ. వెబ్‌సైట్: https://www.ugc.gov.in/
Similar News
News October 11, 2025
CBSE స్కాలర్‌షిప్‌తో బాలికల చదువుకు ప్రోత్సాహం..

ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయ్యి, పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. చివరితేదీ అక్టోబర్ 23. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: <
News October 11, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుసగా 3రోజులు సెలవులు రానున్నాయి. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు స్కూళ్లకు శనివారం, ఆదివారం హాలిడేస్ ఉంటాయి. వీటికి తోడు సోమవారం(OCT 20) దీపావళి కావడంతో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి సెలబ్రేట్ చేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొనే పనిలో పడ్డారు.
News October 11, 2025
ఇండియన్ కోస్డ్‌గార్డ్‌లో ఉద్యోగాలు..

ఇండియన్ కోస్ట్‌గార్డ్ 22 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్, ఎంటీఎస్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.