News February 28, 2025
3 నెలల్లో 17వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల

AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారయ్యాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆ రహదారుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. ‘మిషన్-గుంతలు లేని రహదారుల ఆంధ్ర’ కింద 3 నెలల్లోనే 17,605కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేసిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి వాటికి ఆనుకొని ఉన్న మండల కేంద్రాలకు 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నట్లు వివరించారు.
Similar News
News February 28, 2025
నిర్మాత మృతి.. రూ.100 కోట్ల కోసం మాజీ ఎమ్మెల్యేల కంగారు?

TG: దుబాయ్‌లో నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ తేలడం లేదు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుండగా పోస్టుమార్టంలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు కేదార్ వద్ద పలువురు మాజీ MLAలు రూ.100 కోట్ల డబ్బు ఉంచినట్లు సమాచారం. ఆయన చనిపోవడంతో ఎలా రాబట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.
News February 28, 2025
స్టాక్‌మార్కెట్: ₹10L CR బ్లడ్‌బాత్‌కు విరామం!

స్టాక్‌మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు ₹10L CR నష్టపోయారు. నిఫ్టీ 22,124 (-420), సెన్సెక్స్ 73,198 (-1414) వద్ద ముగిశాయి. Mid, SmallCap సూచీలు 2.5% మేర కుంగాయి. ఆటో, FMCG, IT, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G, PSU బ్యాంకు షేర్లు విలవిల్లాడాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, కోల్ ఇండియా, ట్రెంట్, హిందాల్కో టాప్ గెయినర్స్. ఇండస్ఇండ్, టెక్ఎం, విప్రో, ఎయిర్టెల్, M&M టాప్ లూజర్స్.
News February 28, 2025
ఆప్ హెల్త్‌కేర్ మోడల్ డొల్ల.. డొల్ల: CAG రిపోర్టు

CAG నివేదికలు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీ Govt ఆస్పత్రుల్లో 50-60% డాక్టర్ల కొరత ఉందని హెల్త్‌కేర్ నివేదిక పేర్కొంది. సర్జరీల కోసం రోగులు 6-8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చినట్టు తెలిపింది. 14 ఆస్పత్రుల్లో ICU, 16లో బ్లడ్‌బ్యాంక్స్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్, మార్చురీలు లేవంది. కేంద్రమిచ్చిన కొవిడ్ నిధుల్ని ఖర్చు చేయలేదని, మొహల్లా క్లినిక్కుల్లో బాత్రూములు లేవంది.