News May 5, 2024

170 చలివేంద్రాలు ఏర్పాటు చేశాం: HMWSSB

image

వేసవి తాపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు HYD జలమండలి సిద్ధమైంది. వివిధ అవసరాల కోసం బయటకి వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేస్తోంది. ఇందు కోసం GHMC పరిధిలో 170 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆదివారం తెలిపారు.

Similar News

News November 27, 2024

హైదరాబాద్: సెల్ ఫోన్ డ్రైవింగ్.. యముడి పిలుపు!

image

రోడ్డు ప్రమాదాల నివారణకు HYD పోలీసులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. CYB, HYD, రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లలో నిత్యం సూచనలు చేస్తున్నారు. తాజాగా రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ఫోకస్ పెట్టారు. ‘సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. బహుశ అది యముడి పిలుపు కావొచ్చు’ అని పంజాగుట్టలో ఉన్న ఓ బోర్డు ఆలోచింపజేస్తోంది. Follow Traffic Rules.
Share it

News November 27, 2024

EVMలు ట్యాంపరింగ్ అవ్వవు: కలెక్టర్

image

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.

News November 26, 2024

HYD: ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక నజర్

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్‌లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్‌లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.