News May 3, 2024
నాలుగో దశ బరిలో 1,717 మంది
లోక్సభ ఎన్నికల నాలుగో దశలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో మే 13న జరిగే పోలింగ్లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది బరిలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.
Similar News
News December 26, 2024
సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవేనా?
TG: సినీ ప్రముఖుల ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీటిపై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
1.సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
2.డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి.
3.కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు సహకరించాలి.
News December 26, 2024
అంబటి రాంబాబు సంచలన ట్వీట్
AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.
News December 26, 2024
మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం
సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.