News December 22, 2025
1729.. దీన్ని రామానుజన్ నంబర్ ఎందుకంటారు?

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జబ్బు పడి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ప్రొఫెసర్ హార్డీ ఆయన్ని కలవడానికి ట్యాక్సీలో వెళ్లారు. దాని నంబర్ 1729. హార్డీ అది బోరింగ్ నంబర్ అనగా.. రామానుజన్ వెంటనే దాని గురించి చెబుతూ రెండు వేర్వేరు ఘనాల (Cubes) జతల మొత్తంగా (పైన చిత్రంలో చూపినట్లుగా) రాయగలిగే అతి చిన్న నంబర్ ఇదేనని చెప్పారు. అందుకే దీన్ని Ramanujan Number అంటారు. ఈరోజు రామానుజన్ జయంతి (గణిత దినోత్సవం).
Similar News
News December 22, 2025
Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.
News December 22, 2025
Study Curse: మూడేళ్ల కోర్స్ vs మూణ్నెళ్ల కోర్స్

మన క్వాలిఫికేషన్ ఏదైనా అమీర్‌పేటలో 3 నెలలు కోచింగ్‌తో ఆర్నెళ్లలో IT జాబ్ పక్కా. మనం మాట్లాడుకునేది అమీర్‌పేట లేదా కోచింగ్ సెంటర్ల ఘనతపై కాదు. అలా జాబ్ ఇచ్చే కోర్సులు కాలేజ్ సబ్జెక్టులుగా ఎందుకుండవు అనే. బేసిక్స్ చెప్పే స్కూల్, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చదివితే జాబ్ వస్తుందా అంటే నో గ్యారంటీ. ట్రెండ్, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ కాని చదువు మనకు అంటగట్టడం ఎందుకు? ఏమంటారు ఫ్రెండ్స్?
News December 22, 2025
USలో విద్యార్థినులకు పెరిగిన ‘డీప్‌ఫేక్’ బెడద

USలో స్కూళ్లలో డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్చడం ఎంతోకాలంగా జరుగుతున్నా AI సాంకేతికతతో అది మరింత పెరిగింది. లూసియానా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఓ టీచర్‌పైనా అభియోగాలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాల కేసుల సంఖ్య 2023లో 4,700 కాగా 2025 మొదటి 6 నెలల్లోనే 440,000కి పెరిగినట్లు NCMEC నివేదిక పేర్కొంది.


