News January 15, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

Similar News

News February 22, 2026

ఓవర్సీస్ విద్యానిధి పథకం.. రేపటి నుంచి దరఖాస్తులు

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి (₹20L వరకు సాయం) పథకానికి దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మార్చి 24 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 700కి పెంచింది. ఇందులో BCలకు 500, EBCలకు 200 చొప్పున కేటాయించారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు <>telanganaepass.cgg.gov.in<<>> సైట్ చూడండి.

News February 22, 2026

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.

News February 22, 2026

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని CSIR-<>CCMB<<>>లో 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి PG(బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, వైల్డ్‌లైఫ్ సైన్స్, అగ్రికల్చర్, వెటర్నరీ), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in