News January 27, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

NCERTలో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News February 25, 2026
నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
News February 25, 2026
SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News February 25, 2026
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై CJI అభ్యంతరం

NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో <<19224324>>‘న్యాయవ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై CJI జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుమోటోగా విచారణ చేపడతామన్నారు. ‘ఇది జుడీషియరీపై ఒక ప్రణాళికబద్ధమైన దాడిగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు అనుమతించబోం. ఆ కంటెంట్‌పై న్యాయమూర్తులు కలవరపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.


