News February 7, 2025

మహారాష్ట్రలో 173 GBS కేసులు

image

మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్‌<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News March 19, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.

News March 19, 2026

‘డోరేమాన్’ డైరెక్టర్ కన్నుమూత

image

‘డోరేమాన్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను అలరించిన ప్రముఖ డైరెక్టర్ సుటోము షిబాయామా(84) కన్నుమూశారు. కొంతకాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 6న మరణించినట్లు జపనీస్ యానిమేషన్ స్టూడియో ఆసియా-డో ప్రకటించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. 1980 నుంచి 2004 వరకు డోరేమాన్ టీవీ యానిమేషన్ సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించారు.