News October 8, 2025

రాష్ట్రంలో 1,743 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానం

image

TGSRTCలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డ్రైవర్ పోస్టులకు టెన్త్‌తో పాటు హెవీ ప్యాసింజర్ మోటారు వెహికల్ లైసెన్స్, శ్రామిక్ పోస్టులకు ITI పాసై ఉండాలి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.tgprb.in/

Similar News

News October 8, 2025

క్లచ్ చెస్ టోర్నీ: పోటీ పడనున్న దిగ్గజాలు

image

నేడు USAలో క్లచ్ చెస్ టోర్నీ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ గాస్పరోవ్(రష్యా) ఇందులో తర్వాత పోటీ పడనున్నారు. ఈ దిగ్గజాలు ఇప్పటివరకు పోటీ పడిన గేమ్స్‌లో కాస్పరోవ్‌దే‌పై చేయి. మరోవైపు వరల్డ్ నం.1 కార్ల్‌సన్, భారత ప్లేయర్ గుకేశ్ ఈ టోర్నీలో తలపడనున్నారు. అన్ని ఫార్మాట్లలో గుకేశ్‌పై కార్లసన్‌దే ఆధిపత్యం ఉంది.

News October 8, 2025

విశ్వభారతి సెంట్రల్ వర్సిటీలో 54 పోస్టులు

image

విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ 54 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://www.visvabharati.ac.in/

News October 8, 2025

ఆంక్షలతో జగన్ పర్యటనకు అనుమతి

image

AP: అనకాపల్లిలో రేపు YCP చీఫ్ జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత వెల్లడించారు. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్, వేపగుంట, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో రావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మార్పులు, హాల్ట్ చేయకూడదని పేర్కొన్నారు. జన సమీకరణకు అనుమతి లేదని, ఊరేగింపులు, రోడ్ మార్చ్‌లపై నిషేధం ఉందన్నారు.