News September 17, 2024
17,523 ఎకరాల్లో పంట నష్టం: నంద్యాల కలెక్టర్
నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న 17,523 ఎకరాల పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 400 ఎకరాలలో గుర్తించిన పండ్లతోటల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57 ఆయిల్ ఫామ్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పశుసంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.
Similar News
News December 30, 2024
కర్నూలులో కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ ప్రారంభం
కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇవాళ దేహదారుఢ్య (PMT/PET) పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 600 మంది అభ్యర్థులకు గాను 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్కు హాజరైనట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షలకు 10,143 మంది అభ్యర్థులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు PMT/PET పరీక్షల తీరును ఆయన పరిశీలించారు.
News December 30, 2024
ఆ ఘటనల్లో చర్యలు తీసుకోరా?: ఎమ్మిగనూరు MLA
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 30, 2024
గడివేముల వద్ద ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెసరవాయి-కరిమద్దెల గ్రామాల మధ్య బండి ఆత్మకూరు మండలానికి చెందిన ట్రాక్టర్ కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో వరి నాట్లు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశ్చిమబెంగాల్కు చెందిన సునీల్ సర్దార్ (45)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.