News November 10, 2024
4 నెలల్లో 177 హత్యలు: వైసీపీ

AP: రాష్ట్రంలో గత 4 నెలల్లో 177 హత్యలు, 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయని వైసీపీ ట్వీట్ చేసింది. 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని, బాధితుల్లో 11 మంది హత్యకు గురయ్యారని పేర్కొంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతున్నా కూటమి ప్రభుత్వం కుంభ కర్ణుడిలా నిద్రపోతోందని విమర్శించింది.
Similar News
News February 17, 2026
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. నేడే తుది తీర్పు

2002లో <<18340301>>సంచలనం సృష్టించిన<<>> సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతేడాది నవంబర్‌లో SC రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
News February 17, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 17, 2026
‘జై హనుమాన్’లో కదలిక.. షూటింగ్‌కి రెడీ!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ‘జై హనుమాన్’ను 2024 అక్టోబర్‌లో <<14492400>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ నెల 22న మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హంపికి దగ్గర్లో హనుమాన్‌హల్లిలోని అంజనాద్రి హిల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పాయి. 2024లో రిలీజైన హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కనుంది. ఆంజనేయుడిగా రిషబ్ కనిపించనున్నారు.


