News February 13, 2026
1,782 మంది సిబ్బందితో బందోబస్తు: నంద్యాల ఎస్పీ

శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్‌సీలు 303, పీసీలు 568, ఉమెన్ పీసీలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మందితో పాటు ఏఆర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
Similar News
News March 14, 2026
నాయుడుపేట: అదృష్టమంటే ఆమెదే మరి..!

చోరీకి గురైన వడ్డానం కొరియర్‌లో బాధితురాలు ఇంటికి చేరింది. నాయుడుపేట మండలం పండ్లూరు సమీపంలోని ఓ హోటల్లో ఇటీవల వేడుక జరిగింది. రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఆమె 16 సవర్ల వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వడ్డాణం బాధితురాలు ఇంటికి కొరియర్‌లో వచ్చింది.
News March 14, 2026
IPLలో ఆడనున్న ముజరబాని.. పాక్ బోర్డు లీగల్ యాక్షన్!

PSL కాంట్రాక్ట్‌ను <<19375126>>వదులుకొని<<>> IPLలో KKR తరఫున ఆడటానికి సిద్ధమైన ముజరబాని(ZIM)పై లీగల్ యాక్షన్‌కు పాక్ క్రికెట్ బోర్టు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో ఇస్లామాబాద్ టీమ్ నుంచి తప్పుకోవడాన్ని సవాల్ చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ తొలుత పెషావర్ జల్మీ డైమండ్ జట్టులో చేరి తర్వాత MI టీమ్‌కు షిఫ్ట్ అయ్యారు. కాగా PSL మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.
News March 14, 2026
యాదాద్రి: అక్కది ప్రమాదం కాదు హత్య.. న్యాయం కోసం తమ్ముడి పోరాటం

మోత్కూరు (M) పాటిమట్లలో గత నెల 26న జరిగిన కారు ప్రమాదంపై మృతురాలు ఓర్సు వినోద తమ్ముడు క్రాంతి కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అది ప్రమాదం కాదని, తన బావ రమేశ్ ప్లాన్‌తో చేసిన హత్య అని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారును కావాలనే చెట్టుకు ఢీకొట్టి చంపారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడుతానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


