News April 10, 2024

179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికల నిర్వహణ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మడకశిర నియోజకవర్గానికి 25 మంది, హిందూపురానికి 32, పెనుకొండకు 29, పుట్టపర్తికి 26, ధర్మవరానికి 35, కదిరి నియోజకవర్గానికి 32 మంది సెక్టర్ అధికారులను నియమించామన్నారు.

Similar News

News September 30, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.47

image

అనంతపురంలో టమాటా ధర వారం రోజులుగా నిలకడగా ఉంది. కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.47 పలికినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మార్కెట్‌కు 1350 టన్నుల టమాటాలు వచ్చాయని చెప్పారు. సరాసరి ధర కిలో రూ.38, కనిష్ఠంగా రూ.30 పలికినట్లు పేర్కొన్నారు. ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

News September 30, 2024

అనంతపురం: జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

image

అనంతపురంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పాఠశాల మైదానంలో ఆదివారం జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 80 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికయ్యారన్నారు. అక్టోబర్ 6, 7వ తేదీల్లో కర్నూలు జిల్లా సీ.బెలగల్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న అంతర్ జిల్లా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News September 29, 2024

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్

image

గోరంట్ల మండలంలోని దిగువ గంగం పల్లి తండాలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తెలపడం మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.