News April 14, 2024

డిప్యూటీ స్పీకర్ లేని 17వ లోక్‌సభ

image

17వ లోక్‌సభ పదవీకాలం మరో 2నెలల్లో ముగియనుంది. అయితే సభకు డిప్యూటీ స్పీకర్ లేకుండానే ఈసారి అయిదేళ్లు గడిచిపోయింది. ప్రతిపక్షాలకు ఈ పదవినిచ్చే సంప్రదాయాన్ని 1956లో ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల నేతలు ఈ పదవిని అలంకరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఈ పదవి పొందేందుకు సరిపడా ఎంపీలు లేకపోవడంతో కేంద్రం ఈ స్థానాన్ని ఖాళీగా ఉంచేసింది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 17, 2024

హృతిక్ రోషన్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణమిదే!

image

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టైమ్ వేస్ట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కొత్త సినిమాలకు సైన్ చేయాలి లేదా రిటైర్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ‘SIGN MOVIES OR RETIRE HRITHIK’ అని Xలో ట్రెండ్ అవుతోంది. గత ఏడేళ్లలో ఆయన 4 సినిమాలే చేశారు. 2018, 2020, 2021, 2023లో ఆయన మూవీస్ రాలేదు. ప్రస్తుతం NTRతో కలిసి చేస్తున్న ‘WAR-2’ 2025లో రిలీజ్ కానుంది.

News November 17, 2024

సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే

image

ఉద్యోగాల పేరుతో జ‌రిగే మోసాల్లో 75% ఆశావ‌హుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ స‌ర్వేలో తేలింది. ఫేక్ రిక్రూట‌ర్‌ల‌ను గుర్తించ‌డంలో విఫ‌ల‌మై మోస‌గాళ్ల‌కు న‌గ‌దు చెల్లిస్తున్నార‌ని, సున్నిత‌మైన స‌మాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జ‌రిపిన స‌ర్వేలో అత్య‌ధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.

News November 17, 2024

కులం పేరుతో విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది: పవన్

image

దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా పీఎం మోదీకి మాత్రమే ఉందని AP Dy.CM పవన్ అన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే భేద భావం మన దేశంలో లేదు. అమీర్, సల్మాన్, షారుఖ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అబ్దుల్ కలామ్‌ను గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. ప్రజలను కులం, రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆరోపించారు.