News September 15, 2024
18న నరసరావుపేటలో జాబ్ మేళా
జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
Similar News
News October 9, 2024
గుంటూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌డెడ్
నల్లపాడు – అంకిరెడ్డిపాలెం రహదారిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు మార్జిన్‌లో ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని కింద పడ్డాడు. ఈ క్రమంలో కారు ఆ వ్యక్తి తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. మృతుడు గుర్రాల మరియదాసు (60)గా గుర్తించారు.
News October 9, 2024
రాష్ట్రస్థాయి జట్టుకు శావల్యాపురం విద్యార్థిని ఎంపిక
శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.కావ్య బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌లో నాగపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో కావ్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థినిని అభినందించారు.
News October 9, 2024
నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు: కలెక్టర్
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.