News September 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

Similar News

News December 15, 2025

చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

image

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.

News December 15, 2025

ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

image

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.

News December 15, 2025

చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

image

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.