News December 17, 2024
18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను 18న ఉ.10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం లక్కీడిప్‌లో సెలెక్టయిన వారి జాబితాను ప్రకటిస్తారు. ఆపై సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
Similar News
News October 20, 2025
చిత్తూరులో PGRS రద్దు

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.
News October 20, 2025
ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
News October 19, 2025