News December 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను 18న ఉ.10 గంట‌ల‌కు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం లక్కీడిప్‌లో సెలెక్టయిన వారి జాబితాను ప్రకటిస్తారు. ఆపై సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

Similar News

News January 20, 2025

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

image

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్‌పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

News January 20, 2025

చిత్తూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

image

కలిచర్లలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. పెద్దమండెం మండలం, ఖాదర్ షరీఫ్ కుమారుడు ఉస్మాన్(21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉస్మాన్ ఊరికి సమీపంలోనే ప్రభుత్వ కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్లపొదల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2025

చిత్తూరు జిల్లాలో తెరుచుకున్న స్కూళ్లు 

image

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. వారం నుంచి ఇంటి వద్ద సంతోషంగా గడిపిన చిన్నారులు స్కూళ్లకు బయలుదేరారు. స్నేహితులతో ఆటలు, అమ్మచేతి కమ్మని వంట, బంధువుల ఆప్యాయత మధ్య గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ స్కూళ్లకు వెళ్లారు. పలువురు ‘అమ్మా.. ఇవాళ నాకు కడుపు నొప్పి.. నేను బడికి వెళ్లను అంటూ మారం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. మీరు ఇలానే చేశారా?