News July 17, 2024
18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
Similar News
News July 11, 2025
చిత్తూరు: వర్షాలు లేక తగ్గిన ఖరీఫ్ పంటల సాగు

ఉ.చిత్తూరు జిల్లా రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని మండలాల్లో వర్షాల కారణంగా సాగు ప్రారంభించారు. గతేడాదితో పోల్చితే వేరుశనగ, వరి సాగు 50 శాతం మాత్రమే ఉందని సమాచారం. వరిని రైతులు 11వేల హెక్టార్లకు 4వేల హెక్టార్లలో సాగు ప్రారంభించారు. వేరుశనగ 36 వేల హెక్టార్లకుగాను సుమారు 1,000 పైగా హెక్టార్లలో సాగు ప్రారంభమైంది. త్వరలో వర్షం లేకపోతే సాగు కష్టమే అంటున్నారు రైతులు.
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.