News July 10, 2024
18న సూర్యాపేట పోస్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూలు

తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్‌లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 24, 2025
రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
News October 24, 2025
2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.


