News August 20, 2024
’18సం.నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి’

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్డిఓలకు తహశీల్దార్లకు స్పెషల్ సమ్మరి రివిజన్ (SSR )పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు.
Similar News
News December 12, 2025
నల్గొండలో కాంగ్రెస్- 19, బీఆర్ఎస్- 11 బీజేపీ- 1

నల్గొండ మండల వ్యాప్తంగా గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 11 స్థానాల్లో గెలిచి సత్తా చాటగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాగా, రసూల్‌పుర, కోదండపురం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 12, 2025
కోమటిరెడ్డి స్వగ్రామంలో విజయం ఈయనదే..

నార్కట్ పల్లి మండలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన చిరుమర్తి ధర్మయ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన బుర్రి రాములుపై 779 ఓట్ల తేడాతో ధర్మయ్య విజయం సాధించారు. బుర్రి రాములు విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బ్రాహ్మణ వెల్లంల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం.
News December 11, 2025
హైదరాబాద్ జట్టును ఓడించిన నల్గొండ టీం

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు మహబూబ్‌నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.


