News November 10, 2024

18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి

image

2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News September 18, 2025

ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.

News September 18, 2025

ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

image

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

News September 17, 2025

స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

image

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.