News April 17, 2024

18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న రానుందని ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్‌కు దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలు దీనిని గమనించాలని, పై తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కలెక్టరేట్‌కు దరఖాస్తుదారులు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Similar News

News April 21, 2025

CMRF స్కాం వెనుక RMPలదే ప్రధాన హస్తమా..?

image

ఖమ్మంలో CMRF స్కాం కలకలం రేపుతుంది. చికిత్స చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి CMRF నిధులను దుర్వినియోగం చేసిన 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో RMPలదే ప్రధానహస్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధం అవుతుంది. అలాగే ఖమ్మంలోని మరికొన్ని ఆసుపత్రులపై కూడా నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 21, 2025

ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

image

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ  తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.

News April 21, 2025

కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

image

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్‌ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.

error: Content is protected !!