News December 16, 2025
18 నుంచి వినియోగదారుల అవగాహన వారోత్సవాలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వినియోగదారుల అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. వినియోగదారులకు వారి హక్కులు, వాణిజ్య పద్ధతులపై అవగాహన కల్పించి, ఆత్మవిశ్వాసంతో హక్కులను వినియోగించుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు.
Similar News
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>
News December 17, 2025
విశాఖలో 102 మంది ఎస్‌ల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (2/2)

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..
➣11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07291)
➣13న వికారాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07294)
➣14న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07295)
➣17న సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07292)
➣18న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07293)


