News November 10, 2024

18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి

image

2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 13, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ 

image

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News November 13, 2024

సూర్యాపేట: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ SUSPEND

image

విద్యార్థినులతో, మహిళా ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని DEO సస్పెండ్ చేశారు. ఆయన వివరాల ప్రకారం.. ఈనెల 8న సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం పాఠశాలలో ఉమెన్ డెవలప్‌మెంట్ చైల్డ్ వెల్ఫేర్‌ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గణిత టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9, 10వ తరగతి విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు తెలపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 12, 2024

నల్గొండ: రైతన్నకు ‘మద్దతు’ ఏది?

image

ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.