News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News November 17, 2025

నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లకు, రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News November 17, 2025

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.

News November 17, 2025

MLG: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

image

గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క జన్మస్థలమైన తాడ్వాయి మండలం బయక్కపేటలో మంత్రి సీతక్క ఆదివారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం గుడి ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి, ఆలయ అభివృద్ధి పనులు తప్పక చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి, మండల అధ్యక్షుడు దేవేందర్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ తదితరులు పాల్గొన్నారు.