News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News November 20, 2025
ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.
News November 20, 2025
HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
News November 20, 2025
కరీంనగర్: డయల్ 100కు 47,481 కాల్స్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ‘విజిబుల్ పోలీసింగ్ సిస్టం’ పకడ్బందీగా అమలవుతోంది. డయల్ 100 ద్వారా ఈ మధ్య కాలంలో 47,481 కాల్స్ రాగా, అందులో 2,547 ప్రమాదాలు, 493 ఆత్మహత్యాయత్నాలు, 5,961 మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఉన్నాయి. దీంతో ఘటన ఏదైనా డయల్ 100కు కాల్ చేయాలన్న చైతన్యం ప్రజల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.


