News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News November 21, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,803 మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రూ.లక్ష లోపు రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2,803 మంది చేనేత కార్మికులకు రూ.23.25 కోట్ల రుణమాఫీ కానుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్య తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
News November 21, 2025
కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.
News November 21, 2025
YV సుబ్బారెడ్డిని సిట్ అడిగిన ప్రశ్నలు ఇవేనా..?

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్ అధికారులు సుమారు 11గంటల పాటు విచారించారు. ఎందుకు టెండర్ల నిబంధనలు మార్చారు? మైసూరు ల్యాబ్లో ఎందుకు పరీక్షలు జరిపారు? నెయ్యి కాదని రిపోర్ట్ వచ్చినా ఎందుకు కొనసాగించారు? అని ప్రశ్నించారు. పీఏ చిన్న అప్పన్న గురించి ప్రశ్నలు సంధించి రికార్డ్ చేసుకున్నారు.


