News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News March 21, 2025

మాదకద్రవ్యాలు అరికట్టేందుకు సిద్ధం: సీపీ 

image

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్‌పై పోలీస్ సిబ్బంది అధికారులకు సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. 

News March 21, 2025

VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

image

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.

News March 21, 2025

కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’ 

image

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. 

error: Content is protected !!