News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News November 14, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పీటీఎం సమావేశం

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు (శుక్రవారం) తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థుల హాజరు శాతం పెంచడం, పాఠశాలల అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని ఆయన సూచించారు. చర్చించిన అంశాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ తెలిపారు.

News November 14, 2025

3 చోట్ల ముందంజలో ప్రశాంత్ కిశోర్ పార్టీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ 3 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ పార్టీ ప్రభావం చూపించదని అంచనా వేశాయి. కీలకమైన స్థానాల్లోనూ ఓట్ల వాటాను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్ మహాగఠ్‌బంధన్‌పై పడే అవకాశం ఉంది. మరోవైపు NDA కూటమి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా దూసుకెళ్తోంది.

News November 14, 2025

సంగారెడ్డి: నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

image

సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేటి (శుక్రవారం) నుంచి నవంబర్ 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రతిరోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. విలువైన కార్యక్రమాలను సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.