News February 15, 2025

18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News February 27, 2026

పార్వతీపురం: వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధి పనులు వేగవంతం కావాలి

image

జిల్లాలో నిర్మితమవుతున్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. APSMIDC ద్వారా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్‌లో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. పాలకొండలో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు, సాలూరు, కురుపాం ప్రాంతాల్లో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News February 27, 2026

చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

image

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.

News February 27, 2026

లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కలకలం

image

లక్షెట్టిపేట పట్టణంలో 15 రోజులుగా రూ.500 దొంగ నోట్లు విపరీతంగా చలామణి అవుతుండటంతో ప్రజలు, వ్యాపారస్తులు హడలెత్తిపోతున్నారు. కేటుగాళ్లు వ్యూహాత్మకంగా సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంపులు, వైన్ షాపులను టార్గెట్ చేస్తూ ఈ నకిలీ నోట్లను మారుస్తున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తుపట్టలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు నిఘా పెంచి దొంగ నోట్ల ముఠాను పట్టుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.