News February 15, 2025
18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

వరంగల్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News September 17, 2025
GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News September 17, 2025
నల్గొండ: భూస్వామ్య కుటుంబంలో పుట్టి వారినే ఎదిరించాడు

నిజాం అనుచరులను ఎదిరించడంలో వేములపల్లి (M) రావులపెంట దళం ప్రధాన పాత్ర పోషించింది. అక్రమ వసూళ్లు, హత్యలు,అత్యాచారాలతో విసిగిన ప్రజలు తిరగబడ్డారు. రావులపెంట భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సీతారాంరెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి దాడులు చేశారు. గ్రామంలోని కోటబురుజును కేంద్రంగా చేసుకొని పాములపాడు, ఆమనగల్లులో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను తరిమికొట్టారు.
News September 17, 2025
భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.