News October 31, 2024

రుతురాజ్, జడేజాకు రూ.18 కోట్లు

image

చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ రూ.18 కోట్లు, పతిరణ రూ.13 కోట్లు, శివమ్ దూబే రూ.12 కోట్లు, జడేజా రూ.18 కోట్లు, ధోనీ రూ.4కోట్లు(అన్‌క్యాప్‌డ్ ప్లేయర్) వెచ్చించి అట్టిపెట్టుకుంది.

Similar News

News January 5, 2026

IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

image

భారత్‌తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్‌కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్‌కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.

News January 5, 2026

లాప్స్ అయిన పాలసీని రివైవ్ చేస్తే లాభామేనా?

image

లాప్స్ అయిన పాలసీలను మళ్లీ రివైవ్ చేసుకునే అవకాశాన్ని LIC కల్పించింది. దీనివల్ల పలు లాభాలు ఉంటాయి. పాలసీలో చేరినప్పటి వయసు ప్రకారమే తక్కువ ప్రీమియం కొనసాగుతుంది. పాత పాలసీల్లో మినహాయింపులు తక్కువగా ఉంటాయి. కొత్తగా మెడికల్ చెకప్స్ చేయించుకునే అవసరం ఉండదు. కట్టాల్సిన బాకీ ప్రీమియం మొత్తాన్ని మార్చి 2లోపు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. 30% డిస్కౌంట్ కూడా ఉంది.

News January 5, 2026

నల్లమల సాగర్‌పై అభ్యంతరాలెందుకు: రోహత్గి

image

పోలవరం, నల్లమల సాగర్‌పై SCలో విచారణ <<18768178>>వాయిదా<<>> పడిన విషయం తెలిసిందే. AP తరఫున ముకుల్ రోహత్గి, జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడంపై అభ్యంతరాలు ఎందుకు? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు’ అని TGని ఉద్దేశించి ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు.