News October 30, 2024
శివమ్ దూబేకు రూ.18 కోట్లు?

సీఎస్కే తమ రిటెన్షన్ జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ, మతీశ పతిరణ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేను రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. కాగా శివమ్ దూబేకు నాలుగో ఎంపికగా రూ.18 కోట్లు చెల్లించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే వంటి నాణ్యమైన ప్లేయర్లను వదులుకుని దూబేకు అంత పెట్టడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 17, 2026
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామకివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News January 17, 2026
మళ్లీ సంక్రాంతికి వస్తాం!

భోగి నాడు మంటల వెలుగుల్లో బంధువులతో పంచుకున్న వెచ్చని మమతలు, సంక్రాంతి రోజు ఆరగించిన పిండి వంటల రుచులు, కనుమకు చేసిన సందడి జ్ఞాపకాలను మోసుకుంటూ జనం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. సెలవులు ముగియడంతో చదువులు, వృత్తి, వ్యాపారం రీత్యా పట్టణాల్లో స్థిరపడిన వారు బిజీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. అమ్మానాన్నలకు జాగ్రత్తలు చెప్పి, బంధువులు, స్నేహితులకు మళ్లొస్తామని హామీ ఇచ్చి సొంతూళ్లకు టాటా చెబుతున్నారు.
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<


