News November 24, 2024
అర్ష్దీప్ సింగ్కు రూ.18 కోట్లు

భారత స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను పంజాబ్ తిరిగి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.18 కోట్లకు RTM పద్ధతిలో పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతడు పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం సింగ్ స్పెషాలిటీ.
Similar News
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 12, 2025
సుదీర్ఘ నిరీక్షణకు తెర.. రేపటి నుంచి ‘డ్రాగన్’ షూటింగ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానుంది. ఏప్రిల్లో 2 వారాల షూటింగ్ తర్వాత 6నెలలు గ్యాప్ ఇచ్చిన మేకర్స్ రేపటి నుంచి చిత్రీకరణలో బిజీ కానున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో కీలక సీన్లు, సాంగ్ను చిత్రీకరించనున్నారు. రెండు పార్టుల షూటింగ్ను ఒకేసారి పూర్తిచేసి తొలి భాగాన్ని 2026 DECలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


