News March 31, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Similar News
News November 19, 2025
కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 19, 2025
టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్సైట్లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 19, 2025
ఈ హెయిర్ స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించాలని సూచించారు.


