News April 1, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు వేంకటేశ్వరుడి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,007 మంది భక్తులు దర్శించుకోగా.. 27,440 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి హుండీ ఆదాయం రూ.3.04కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Similar News
News December 4, 2025
ఫీటస్ హార్ట్బీట్ రాకపోవడానికి కారణాలివే..!

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారు.
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.


