News February 14, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 60,203 మంది దర్శించుకోగా, వారిలో 21,793 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.
News November 8, 2025
కర్ణాటక స్పెషల్ డ్రైవ్… 102 ప్రైవేట్ బస్సులు సీజ్

కర్నూలు దగ్గర <<18155705>>బస్సు<<>> ప్రమాదంలో 19 మంది మృతితో కర్ణాటక GOVT PVT ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు దిగింది. 12 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. OCT24 నుంచి NOV 5 వరకు 4452 బస్సుల్ని తనిఖీ చేసి 102 బస్సుల్ని సీజ్ చేసింది. 604 కేసులు నమోదు చేసిన అధికారులు ₹1,09,91,284 జరిమానా వసూలు చేశారు. కాగా AP, TGల్లో మాత్రం కొద్దిరోజులు హడావుడి చేసి తరువాత మిన్నకుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


