News March 20, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News March 21, 2025
‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్‌తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
News March 20, 2025
ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.
News March 20, 2025
మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.